పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామచంద్రుఁడు సీతాలక్ష్మణసమేతుఁడై యాదవాద్రిస్వామిని పూజించుట

సీ.

హరిభక్తినియతాత్ములైన మీ రవధాన
                       మున వినవలయుఁ బ్రమోదమంది
యొకపుణ్యకథ మహాయోగులు మీ రెఱుం
                       గనియది లే దైనఁ గరుణ గలిగి
యడిగితి రిట యాదవాచలసీమఁ బ్ర
                       శక్తి నారాయణార్చన మొనర్చి
కాకుత్థ్సవంశశిఖామణియైన శ్రీ
                       రామచంద్రుఁడు జగద్రక్షకుండు


తే. గీ.

వనమునకు వచ్చి యొకనాఁడు వసుమతీకు
మారియును లక్ష్మణుఁడు గొల్వ మహిమ మెఱసి
యమ్మహాగిరితటమున నధివసించె
నవ్యయానంద మాత్మలో నంకురింప.

121


వ.

అంత.

122


తే. గీ.

లక్ష్మణుం డన్నఁ జూచి యుల్లమున విస్మ
యంబు దలకొన స్వేతన్నగాగ్రసీమ
మానసోపమకాసారమౌళి యొకటి
భాసురంబయ్యెఁ జూడు మప్రాకృతంబు.

123


ఉ.

[1]తత్తటియందు రత్నకలితంబగు దివ్యవిమానవీథి భా
స్వత్తులమై సమాభ్యధికవర్జితసుందరవిగ్రహంబుతో
నుత్తమలీలచేతఁ బురుషోత్తముఁ డొప్పుచు నున్నవాఁడు లో
కోత్తర లక్ష్మి నీవువలె నుల్లమునం గనుపట్టె నా కటన్.

124


తే. గీ.

ఆశుభాకారకాంతివీక్షాభిలాష
మాత్మ జనియించెనేని రమ్మనిన రామ
చంద్రుఁ డపు డేఁగె జానకీసహితుఁ డగుచు
దివ్యతరమైన కల్యాణతీర్థమునకు.

125
  1. అత్తటియందు – వ్రాఁతప్రతియందలి యీపాఠమున యతిభంగము.