పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భోజనంబులు గావింపుచునున్న యాబ్రాహ్మణుని ధనవంతుడని
చోరులు ప్రచ్ఛన్నవేషధారులై ముగురు లలాటంబున, నితరాంగంబుల
ద్వాదశోర్ధ్వపుండ్రంబులు గావించుకొని నారాయణ నారాయణ
యనుచు, విష్ణుభక్తులం గనినఁ బ్రణమిల్లుచు వచ్చువారిం జూచి సుచరితుండు
భుజింపఁబెట్టిన విష్ణునివేదితాన్నంబులు భుజించి నారాయణపదాంభోజ
తీర్థపానం బొనర్చి కృతార్థులు నైనవారలందఱకు మనంబున [1]సర్వోత్త
రంబైన సాత్వికత్వ ముదయింప సాత్వికులై యేము చోరులము. భవ
ద్ద్రవ్యాపహరణంబునకు వచ్చినవారము. వేషమాత్రంబు చూచి యుపచ
రించితి వనిన నగి, యస్మత్కులధనంబు నారాయణాహ్వయంబు. ఆ
ద్రవ్యం బెవ్వరు హరింప సమర్థులు? అనిన విని సంతోషాశ్రుతరంగం
బులతోఁ బులకించి వందనం బాచరించి పరమపదప్రాప్త్యుపాయం బుప
దేశింపు [2]మనిన నాతఁ డట్ల కావింప వారు నైష్ఠికులై దేహావసానంబునఁ
బరమధామంబు నొందిరి అంత.

116


తే. గీ.

సుచరితాత్మయుఁ డంత నస్తోకమహిమ
పుత్రపౌత్రసతీమిత్రపూర్ణభోగ
మంది నారాయణాంఘ్రిపరాయణాత్ముఁ
డగుచు వైకుంఠమందిర మందెఁ దుదకు.

117


క.

ఈసుచరితు సుచరిత్రం
బాసక్తిన్ విని పఠించి హర్షించిన ల
క్ష్మీసఖతుల్యకుమారుల
చే సంతతి నిల్చి యుల్లసిల్లుదురు తుదిన్.

118


క.

ధనధాన్యసంపదల్ గలు
గు నపారముగా సుచరితగుణసంతతికీ
ర్తన వారికి మఱి సద్గృహ
మున కేఁగిన నరుల కగును మురజిత్పదమున్.

119


వ.

అనిన నమ్మునీంద్రులు సంతోషోత్ఫుల్లచేతస్కులై మునిశార్దూలుం
డగు నారదుం జూచి కర్ణంబులకు నమృతప్రవాహంబుగాఁ బల్కితి
వింక నొక రహస్యంబు తెలుపుము. వాసుదేవకథాప్రసంగంబు సేయ
నీకంటె నెవ్వఁడు నేర్చుననిన యుక్తకాలప్రశ్నకరులగు మీచేత లోచన
పారణయగు రూపంబున నాతలంపునఁ బొడమెనని యానారదుం
డిట్లనియె.

120
  1. సర్వోత్తరంబైన సాత్వికులై
  2. మన నట్ల కావింప వారు పరమధామంబు నొంది రంత.