పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

దివ్యాన్నభైక్షంబు [1]వెట్టి లోకమాత యనుగ్రహించి యనుపవచ్చిన సుశీల
తానును దత్సుతుండును భుజించి హర్షించి రత్నంబులు గాంచి యక్కు
మారుం బ్రశంసించుచు ధనరక్షార్థంబుగా మేల్కనియుండె. అంత
సుచరితుండు చోరభగ్నాంగుండై యాఁకటం గృశించి పుత్రులతో
గృహంబునకు వచ్చుచుండె. అట్లు వచ్చు తనభర్తం గాంచి లజ్జితయై
నలి యెదుర్కొని.

113


క.

సర్వాంగీణవ్రణుఁ డై
దుర్విధుఁడైయున్న మగనితో వేగమె యం
తర్వేదన దొలఁగఁగఁ గుల
నిర్వాహకుఁడైన సుతుని [2]నే ర్పెఱిఁగింపన్.

114

సుచరితుఁడు పశ్చాత్తప్తుఁడై కల్యాణతీర్థంబున తపస్సు చేయుట

సీ.

ఎంత మూఢుండ నే నిందిరాసహితుఁడై
                       పత్రపుష్పఫలాంబుభక్ష్యములు ని
వేదితంబులు సేయ మోదించి సర్వస్వ
                       దాయియై యున్న నారాయణుని వి
సర్జించి యన్యదేశములకు నేఁగి య
                       త్యల్పజనంబుల నాశ్రయింపఁ
దగునె కృష్ణఘనుండు తతకృపారసములు
                       గురియంగ నన్యభిక్షుకుల వేఁడఁ


తే. గీ.

దెలివి లజ్జాభిమానవృత్తినిఁ జరింప
నున్న నాకు నమస్కృతు లొక్కటైనఁ
జేయఁగా నర్హమని యాత్మఁ జింత నొంది
సుచరితాహ్వయవిప్రుఁ డచ్చోట నిలిచి.

115


వ.

నారాయణభజనంబు సేయుచుం దనయుండగు నారాయణునకు వేద
శాస్త్రోపదేశంబులు గావించి లక్ష్మీప్రసాదలబ్ధసంవత్సమృద్ధిచే సదా
చారసమన్వితుండై ప్రియయుం దానును గల్యాణతీర్థంబునఁ దపంబు
సేసి యచ్యుతుని మెప్పించి సహస్రగుణితంబులుగా బ్రాహ్మణులకు

  1. వెట్టిన సుతుండు దెచ్చిన సుశీల
  2. నే ర్పెఱిఁగించెన్