పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

[1]ద్రవిడేశుఁబొడ గనఁ దండ్రియన్నలుఁ బోవ
                       మాతులగృహమున మాతతోడ
ఆకట డస్సి శ్రమార్తుఁడై నారాయ
                       ణాఖ్యుఁడు చేరి భోజ్యంబు వేఁడ
అన్నంబు తల్లి పత్రాంతరమున నిడ
                       ననివేదితంబని యారగింప
ననిన నీవే నివేద్యము సేయుమట్లన్న
                       ననుమతి గావించి హరికి నొసఁగి


తే. గీ.

యతని భుజియింపుమని మ్రొక్కి యంబుజాన
నార్పితోరుచతుర్విధాహారములు తృ
ణీకరించి భుజించె నాలోకవిభుఁడు
సంయమివరేణ్యులందఱు సంస్తుతింప.

110


వ.

ఇట్లు భుజించిన పాత్రంబున సిక్థంబును లేక యుండ బాలుండును
హర్షించి తల్లికడ కేఁగి యన్నంబు వేఁడిన మునుగొని చనిన నివేదితా
న్నం బేమి యయ్యెననిన నీశ్వరుండు భుజించెననుట విని మార్జాలాదుల
కప్పగించి భగవంతుండు భుజించెననుట యుక్తంబే యని తర్జించి బిక్షాట
నంబు సేయుమని పాత్రం బిచ్చిన.

111


సీ.

ఏగృహంబున కతఁ డేఁగిన నిందిర
                       యాగృహంబున కపు డరుగుదెంచి
దర్విచే భైక్ష్యంబుఁ దయ నొసంగిన నది
                       రత్నమయంబయి ప్రబలభార
సారమైయున్న నశక్తుఁడై హస్తద్వ
                       యంబునఁ దత్పాత్ర మట వహించి
శిరమునఁ బూని యాశిశువు తల్లికి నప్పు
                       డర్పింపఁ దత్పాత్ర మంది కాంచి


తే. గీ.

[2]యేడుమా ర్లిట్ల యిచ్చె రమేందువదన
యెనిమిదవమాఱు ఘనమౌ నిజేష్టపాత్ర
మొకటి యిచ్చి కుమార! నీ వేఁగు మనుచుఁ
దల్లి యనిచిన వచ్చు పుత్రకునిఁ జూచి.

112
  1. ద్రవిళేశు
  2. యేడుమా ర్లిట్లన యిచ్చెరమేందువదన — ఈపాఠమున గణభంగము.