పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఊర్ధ్వకామతఁ దగి యూర్ధ్వరేతస్కులై
                       యజ్ఞవరాహరూపాస్మదర్చ
నాతిశయప్రాప్తి నందెడువారికి
                       నూర్ధ్వపుండ్రవిధాన మొప్పఁజేయఁ
బక్షికులాధీశుఁ బనిచిన నతఁడు శ్వే
                       తద్వీపమున నుండి ధవళమృత్తి
కాకర్దమముఁ దెచ్చి కల్యాణతీర్థప
                       శ్చిమభాగమున గనిచేసి నిల్పెఁ


తే. గీ.

గాన యిది మృత్తికలకు నగ్రణి సమస్త
దేవతామూర్తి కల్యాణతీర్థమున ము
నింగి యీశ్వేతమృత్తికనిటల[1]తటిని
నునుప ననుపమమైన సాయుజ్య మమరు.

90


వ.

ఈకల్యాణతీర్థంబున మునింగి యధికారానురూపంబుగా నను భజించిన
వారు మత్ప్రసాదంబున నిఖిలమనోరథంబులు నొందఁగలరు. ఈ
కల్యాణతీర్థతీరంబునఁ బైతృకక్రియలు గావించినఁ బితృగణంబులు
[2]హర్షించు పుణ్యపరవృత్తి నధ్యాత్మగుణసంపత్తి నపవర్గపరాయ
ణులై పెక్కండ్రుపుత్రులం బడయఁగలరు. ఈకల్యాణతీర్థతీరం
బున యజ్ఞంబుఁ జేసిన సహస్రగుణంబగు పుణ్యంబు సంభవించి యప
వర్గంబు గాంతురు. ఈకల్యాణతీర్థంబున నిష్కాములై నన్ను సేవిం
చినయేని యభీష్టంబు లొసంగుదు. ఈకల్యాణతీర్థతీరంబున
దానంబుఁ జేసినఁ జతురార్ణవీపరిమితమహీతలం బేలుచుఁ జక్రవర్తియై
పుత్రపౌత్రాభివృద్ధిగా వర్ధిల్లు. ఈకల్యాణతీర్థగర్భంబున వ్రతంబు
లాచరించిన బ్రహ్మలోకంబున బ్రహ్మతో ననుమోదించుచు నుంద్రు.
ఈకల్యాణతీర్థంబునఁ గోరిన కోరికలన్నియు మత్ప్రసాదంబున ఫలి
యించు. ఫాల్గుని ప్రశస్తంబు గాన నాఫాల్గునియందు సర్వధర్మంబులు
గావించి మీ రచ్చటికిం జనుదెం డనిన రుద్రముఖ్యత్రిదశాధిపులు భగవ
ద్వాక్యంబులు విని నిజస్థానంబులకుం జనిరి. అంత.

91
  1. శిరము
  2. హర్షించి