పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సనత్కుమారునకు బ్రహ్మ శ్రీహరియర్చామూర్తి గలదివ్యవిమానం బొసఁగుట

వ.

భక్తవత్సలుండైన భగవంతుండు జగం బేరీతి నానందంబుఁ బొందించె
నానతీవే యని [1]ఋషు లడిగిన నారదుం డిట్లనియె.

57


క.

కలశాబ్ధినుండి యొకనాఁ
డలఘుండు సనత్కుమారుఁ డాసనకాదుల్
గొలువన్ నారాయణపద
జలజప్రవణుం బయోజసంభవుఁ గాంచెన్.

58


ఆ. వె.

కాంచి మ్రొక్కి శిష్యగణములలోఁ బెద్ద
యాత్మజుండు మీకు [2]నతిదయావి
భాస! జ్ఞానభక్తివైరాగ్యదాయివై
యాత్మలోఁ గషాయ మణఁచి తిపుడు.

59


క.

పొగడఁగ[3]
సర్వాంగాన్విత
నిగమాధ్యాపన మొనర్చి నిష్ఠానియతిన్
దగి కర్మబ్రహ్మవిచా
రగరిమ సంశయముఁ దీర్చి రక్షించితిగా.

60


క.

పరమగురుండవు నీవే
యరయన్ గురుఁ డొకఁడు గల్గఁ డన్యుఁడు మాకున్
సురహస్యార్థములన్నియుఁ
బురుషోత్తమ! తెల్పితి వపూర్వప్రజ్ఞన్.

61


క.

ఈతఱి నీవు భజించు స
నాతను లక్ష్మీసనాథు నారాయణు సం
ప్రీతిం బూజించెదఁ బు
ణ్యాతతమగు తద్విమాన మర్పించు దయన్.

62


క.

అనిన క్షణమాత్ర మబ్జా
సనుఁ డూరకయుండి శేషశాయివిమానం
బనఘచరిత్రుండగు నా
సనత్కుమారునకు నపు డొసంగఁదలంచెన్.

63
  1. పురుషు లడిగిన
  2. నతిదయాబ్ధివాస!
  3. పొగడఁగ వేదాంతాన్విత