పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

దేవతామానుజ తిర్యగాదులు నీవ
                       యాదిమమూర్తిత్రయంబునందు
నొకఁడవు నీవ యీయున్నయేమును నీవ
                       నీవును నీవ యీనిఖిలజగతిఁ
దలకొని యీక్షణధ్యానసంస్పృష్టుల
                       నలమత్స్యకూర్మవిహంగమాది
రూపంబుల జనించు నాపరాత్మవు నీవ
                       యీలోకములు నిర్వహింప నీవ


తే. గీ.

యను యుగంబనఁ గరుణతో నవతరించి
యిట్లు విశ్వంబు నిలుపు వే ల్పెవ్వఁ డనఘ
దాసుఁడను నీకు నాకుఁ ద్వద్దాస్యమహిమ
వశ్యులైరి సుపర్వు లోవనజనేత్ర!

54


వ.

అది గావున సర్వలోకనాథుఁడవు నీవే. సర్వవైదికకర్మంబుల నిన్నె
యారాధింపుదు. దేవతాపితృదేవతలు భవత్కంచుకపాయత్వంబు
వహించినవారలు. వైదికనమోవాక్యంబులు భవత్పదంబునందే
[1]పర్యవసించుచున్నయవి. రాజులకుం జేసిన నమస్క్రియలు వారవాణం
బులకుఁ [2]బ్రాపింపవు. కాన మోక్షాపేక్షులు నీకంటె నన్యుని సేవింపరు.
అధికారంబులు వ్యక్తంబులైన కర్మఫలంబు లొసంగంబూనినవాఁడవు
నీవే. ఏనును, శంకరుండును, నధ్వర్యసర్వదేవతలును ద్వదా
యత్తత నున్నవార మని చతుర్ముఖుండు విన్నవించినఁ బ్రసన్నుండై
భగవంతుండు నీవు యుగాయుతంబు పూజించెదవు, ఆమీఁదఁ బుత్రు
లచేఁ బూజింపఁజేయుమని యాన తిచ్చిన నట్లనే కావింపుచునుండె. అంత.

55


క.

భావమున భగవదావి
ర్భావము గావించి నీవు పలికిన విని స
ద్భావమున నుండు మిల నా
భావజగురుఁ డిడినయట్ల పరిపాలించెన్.

56
  1. పరవసింపుచున్నయది
  2. బ్రాపించవు