పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్లు సంతోషసంభ్రమపులకితసర్వాంగుండైన చతుర్ముఖునిం జూచి
హర్షించి కారుణ్యరసదీర్ఘికాదీర్ఘలోచనుండై భగవంతుఁ డనుగ్రహించు
నెడ దేవవిద్యాధరకిన్నరులు వినుతించిరి. అప్సరఃకాంత లాడిరి.
ఉత్తాలంబులైన తాలంబులచేతను, దళితాంబరంబులైన మర్దళంబుల
చేతను, నర్తకకరకంకణంబులచేతను, గంధర్వగానంబుచేతను,
సనకాది జయజయశబ్దంబులచేతను జగద్వలయంబు శబ్దాత్మకంబై
యుండె. విధాత పరమభక్తిమయి పులకించి యపౌరుషేయవాక్యంబు
లం బ్రస్తుతించె.

46

బ్రహ్మ శ్రీమన్నారాయణుని స్తుతించుట

తే. గీ.

దేవ నారాయణ నమో౽స్తు తే రమేశ
వాసుదేవ నమో౽స్తు తే వరద సర్వ
లోకరక్ష నమో౽స్తు తే పాకవైరి
పూజ్యపాదాబ్జ [1]మాధవ భోగిశయన.

47


తే. గీ.

కారణాయ నమో రక్షకాయతే న
మో నమో వరతే నమో మునిజనైక
కుశలదాయపరేశ వైకుంఠవాసి
నే [2]నమః శ్రీనివాసాయ నిఖిలశరణ.

48


శ్లో.

అచ్యుతాయ నమస్తుభ్య మనంతాయచ తే నమః
శాస్త్రే సమస్తలోకానాం గోవిందాయ నమో నమః.

49


శ్లో.

పరాయ వ్యూహరూపాయ విభవాయచ తే నమః
అంతర్యంత్రే నమస్తుభ్య మర్చారూపాయ తే నమః.

50


శ్లో.

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః
ధారకో౽సి సమస్తానాం జగతాంచ జగత్పతే!

51


వ.

అని వినుతించి మఱియు నిట్లనియె.

52


ఆ. వె.

మహిమ నీ వజాయమానుండవై జాయ
మానుఁ డవనఁ దగుట మది దలంపఁ
గర్మహేతుశక్తి గాదు ప్రాకృతశక్తి
నైనఁ గాదు సంశయంబు లేదు.

53
  1. కృష్ణయంభోధిశయన. సర్వసంస్కృతరచన కావున ఈ పాఠమున కృష్ణయంభోధి అనుచో యడాగమము ప్రసక్తము కాదు.
  2. నమో శ్రీనివాసాయ అనుపాఠమున సంధిదోషము సంభవించును.