పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

రుద్రానుకీర్తిభూషా
ముద్రాంకభుజాంతరున్ సమున్నతుఁ ద్రిజగ
ద్భద్రకరు నీశకార్యా
నిద్రాణోద్యోగుఁ బతగనేతం గాంచెన్.

36


క.

వితతఫణామణినీరా
జితభగవత్పాదపద్మస్థిరతరభక్త్యా
ధృతివిభ్రాంతశిరస్కుని
శతకోటిసుధాంశుతేజుఁ జక్రిపుఁ గాంచెన్.

37


క.

కమలావిభ్రమపాండుర
కమలంబనఁ బూర్ణశీతకరజనకంబై
విమలంబగు ధవళచ్ఛ
త్రముఁ గాంచెన్ జక్రిపై నుదగ్రత మెఱయన్.

38


క.

విరజామరుదంకూరో
త్కరపరిశ్రుతి మాతపట్టికామండితమై
గరుడాంకమైన యాశ్రీ
హరి విజయధ్వజముఁ గాంచి హర్షము నొందెన్.

39


సీ.

పరిఫుల్లమల్లికాభ్రాంతమిళింద మం
                       డలమండితంబై యనంతవిద్యు
దాకీర్ణమేఘజాలావృతంబైన చం
                       దంబున రాణించి తరుణనీర
జాప్తసహస్ర[1]తేజో౽తిదైన్యప్రద
                       హేమకళిక సూచితేశ తత్త
దైశ్వర్యవైభవంబై ముక్తిమార్గని
                       త్యావబోధకసకలాగమోద్గి


తే. గీ.

రణరణత్కింకిణీ ఘనరవన మిద్ధ
బద్ధకరపుటసంస్తువత్పంచహేతి
కృతజయస్వనమై మహోన్నతి వసించు
హరినివాసంబుఁ గాంచె నయ్యబ్జసూతి.

40


తే. గీ.

సత్యలోకస్థులైన యాసనకముఖ్యు
లంబుజేక్షణు గరుడాంకు నపుడు గాంచి
విస్మయము నొంది రత్యంతవివశు లగుచు
నంతకంతకు నానంద మంకురింప.

41
  1. తేజాతిదైన్య. ఈపాఠమున అకారాంతపుంలింగతేజపదము గృహీతము.