పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమన్నారాయణుఁడు సపరివారుఁడై దివ్యవిమానంబున బ్రహ్మకు దర్శన మొసంగుట

తే. గీ.

కాహళీనాదమేదురకలకలంబు
దివ్యదుందుభిఘోషంబు దివిఁ జెలంగె
నుపనిషన్మయ[1]పాంచజన్యోరురవము
కర్ణములు నిండెఁ గల్యాణకారణముగ.

31


క.

అమృతంబైన తద్ఘననా
దము వీనుల సోఁకునంతఁ దామరసభవుం
డమితజ్ఞానకళాయో
గము యోగము మానియుండెఁ గడువిస్మితుఁడై.

32


క.

వెలయఁగ విష్ణువె ఫలమున్
ఫల మిచ్చు నతండు ననుచు భజియించెద ను
జ్జ్వలమతి నాతని నాతని
వలననె పొందెద నటంచు వాంఛించె మదిన్.

33


తే. గీ.

అష్ట[2]దిఙ్మధ్యవివ్వృతంబైన దివ్య
మగు ప్రకాశంబు గాంచె నయ్యబ్జసూతి
పద పదమటంచు నంత నప్రాకృతజన
మంతరిక్షంబునందు మెండై చెలంగ.

34


సీ.

వేత్రహస్తులు పురోవీథిఁ గోలాహలం
                       బొనరింపఁ దద్వైణికోత్కరములు
నన్యగాథలు మాని నారాయణుని నభో
                       భ్యంతరాళమున గానం బొనర్ప
వేత్రహస్తుండయి వివిధోరుసంభ్రమో
                       పేతుఁడౌ సూత్రపతీశుఁ గాంచి
చండప్రచండాదిసైనికుల్ తత్పార్శ్వ
                       భాగంబునఁ జెలంగ భక్తి గాంచి


తే. గీ.

ఘనత గజసంహననగజక్రములునగు గ
జాననాదులు శేషాశనాప్తసఖుల
అబ్జజుం డాత్మనేత్రాష్టకార్చనైక
పాత్రుఁడై యుండి యీక్షించెఁ జిత్రమహిమ.

35
  1. పాంచజనోరురవము
  2. దిఙ్మధ్యవనృతంబైన