పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అక్షీణశక్తిని విరూ
పాక్షుండన నొక్కపుత్రుఁ డతనికిఁ గల్గెన్
దక్షుఁడు హరిభక్తిరతుం
డక్షయవిజ్ఞానవైభవాధిక్యుండై.

25


వ.

అంత విధాత పురందరాదిదివిజస్తుతుండై దేవదేవుండన వెలసిన
తనయునకు భవోత్తారకం బుపదేశించి వేదవేదాంతంబులు చదివించిన
నతం డైశ్వర్యంబు వహించి సర్వభూతంబులకు నైహికంబులు కృప
సేయుచునుండ సర్వదేవతలను సర్వఋషులను జతుర్ముఖుండు
సృజించె. బ్రహ్మ సృజించుటకు, విష్ణుండు నిల్పుటకు, రుద్రుండు
హరించుటకుఁ బాల్పడిరి. మఱియును.

26


క.

వెలయఁగ దక్షాదులు పు
త్రులు గొల్వ సరోజభవుఁడు తోడ్తో లక్ష్మీ
లలనాధవపదసేవా
కలనాస్థితి నాచరింపఁగాఁ జర్చించెన్.

27

బ్రహ్మ శ్రీమన్నారాయణుని అర్చారూపమును సేవింపఁగోరుట

క.

అంతం బద్మజుఁడు రమా
కాంతార్చారూపమహిమ గనుఁగొని సకలై
కాంతికధృతిఁ జెందెదనని
చింతించె నశేషతీర్థసీమలయందున్.

28


క.

పులకించి మున్ను చూచిన
బలవన్ముని[1]మానధనముఁ బరమాత్మమదిన్
దలఁపుచు సారోపనిష
త్కులతిలకము మంత్ర మునిచి గురుమతి వెలయన్.

29


తే. గీ.

శమితపాపౌఘమై శంఖచక్రముఖ్య
చిహ్నములు చేత వెలయు నాశ్రితశరణ్య
భాగధేయంబనాఁదగు పరమపురుషు
[2]హసితవేశాశరాప్తిఁ బద్మాక్షుఁ గాంచి.

30
  1. మానధనము పరమాత్మమదిన్
  2. హసితలేశోదరోప్తిమ