పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

కడుమదమున వీగఁ బడివాలు మడివాలు
వసనభార భారి వరలు దాను
గంసమందిరమున కంసరాజితవేణి
హంసగములతోడ నరుగునపుడు.

205


వ.

తమకు ధౌతవస్త్రంబు లడిగిన నీక దుర్భాషలాడిన యాఖలున్
భంజించి తద్వీథిమధ్యంబున నేఁగుచు.

206


క.

పాయక మాలాకారులఁ
బాయక మన్నించి శౌరి బలుఁడుం దానున్
బాయక వర్గముతో నిర
పాయకళామహిమ మెఱసి పాటిలుచుండెన్.

207


వ.

అంత.

208


క.

అనులేపనములు దెచ్చిన
ఘనపాణిని కుబ్జఁ గుజ్జు గాంచి పదమునన్
దనువెల్ల మట్టి యాయం
గన నాకక కుబ్జఁ బోలఁగా నొనరించెన్.

209


ఆ. వె.

వాసి యెఱిఁగి యెపుడు వాసుదేవుఁడు దాని
బాసి విరహ మర్మదాసిఁ జేసె
[1]శిలబునర్చుతోంఛశిలఁ జేయు నాఘనుఁ
డేమి సేయ నేరఁ డీధరిత్రి.

210


ఉ.

ఆవల నుగ్రచాపము మహాబలసంపదఁ ద్రుంచి దానికిన్
గావలి యున్న కాలభటకల్పదురల్పవికల్పజల్పలో
కావళి నుగ్గుగాను రుచిహావళి చేసె దురంతదుర్మదుల్
ధావన మాచరించి వసుధావనవీథులవెంట నేఁగగన్.

211

శ్రీకృష్ణుఁడు కంసుని సంహరించుట

వ.

అంత.

212


తే. గీ.

అపుడు సాయాహ్నశౌరి భావ్యతిశయమున
దివసమల్లునితోఁ బోరి ధృతి జయించి
తదురుగైరికరక్తవస్త్రంబుఁ జించి
కేరి యెగవైచె నన సంజ కెంపు దనరె.

213
  1. పాఠము అర్థవంతముగా లేదు.