పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

సనకసనందనముఖ్యుల్
వినుతింపగ వివిధరత్నవిరచితసింహా
సనమునను శేషశేషా
శననిత్యులు గొల్వఁగాఁ బ్రసన్నత వెలసెన్.

198


వ.

ఉన్న హరికిం బ్రణామం బాచరించి.

199


తే. గీ.

మత్స్య కచ్చప సూకర మనుజసింహ
వామన భృగుకులజ రాఘవ బలభద్ర
బుద్ధ కల్కి హరి ముకుంద భువననాథ
దీనరక్షక నీవు సూ దిక్కు నాకు.

200


వ.

అని యక్రూరుఁ డచ్యుతు నుతియించి యమున వెల్వడి వచ్చి రథంబున
నున్న రామకృష్ణుల నవలోకించి కీర్తించి సూర్యనందనయందుఁ దాఁ
గనినయట్టి యద్భుతంబు విన్నవించి మధురాపురప్రాంతంబున రామ
కృష్ణుల నందాదులతో నునిచి నిజగృహంబునకుం జనియె. రామకృష్ణు
లును మధురం బ్రవేశించి తత్పురవీథిం జనునెడ.

201


చ.

కనకలతాంగి యోర్తు హరిఁ గన్గొని కెంపులతళ్కు జాలిచే
గొనుచును నేఁగెఁ బూను నెడఁగూడక వేడుక భర్మహర్మ్యమో
హనశిఖరాగ్రవీథులకు [1]నార్తిని మూపున వాట్లఁబడ్డ వా
రిని సమయంబునన్ విడుతురే యమరీసమరీతిమానినుల్.[2]

202


మ.

కలకంఠీమణి యోర్తు కృష్ణుఁ డటు రాఁగాఁ జూచి గోవర్ధనా
చల మీ వెత్తుట యెంత యెత్తు మివె నాచన్గొండ లిట్లైన నీ
బలసంపత్తి యెఱుంగవచ్చునని యొప్పన్ బిల్చె నాతళ్కుగు
బ్బలు గాన్పింపఁగ సౌధవీథి నిలిచెన్ బంగారుబొమ్మో యనన్.

203


వ.

ఇట్లు వివిధోజ్జ్వలనిజచేష్టల నవలాలు చూడ నవలావణ్యధాళధళ్యం
బుతో మథురాపురమధ్యంబున కేఁగుచు.

204
  1. నర్తను (పా)
  2. ఈపద్యభావము విశదముగా లేదు.