పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

లోకోత్తరుఁ డాహరి నిజ
లోకాభవలోకధాతృలోకబిడౌజో
లోకాదులైన యుత్తమ
లోకంబులు చూపె గోపలోకంబునకున్.

178


వ.

అంత.

179


సీ.

నందాదు లొకనాఁడు నవ్యోత్సవంబున
                       నంబికావనమున కరిగి యాస
రస్వతినది గ్రుంకి రహితో నుమామహే
                       శ్వరులఁ బూజించి భూసురులకెల్ల
గోహిరణ్యాంబరకోటు లర్పించి య
                       న్నము పెట్టి తా ముదకములు ద్రావి
తద్వ్రతంబున నుండ దైవయోగంబున
                       నందుని నజగర మందునుండి


తే. గీ.

మ్రింగ హరి దాని ద్రుంపఁ బొసంగ నదియుఁ
దాల్చె విద్యాధరత్వంబు దశదిశాంత
రాళ[1]దేదీప్యమానవిశాలమౌళి
మాలికాలంకృతశ్రీల మహిమ మెఱసి.

180


వ.

ఇట్లు మెఱసి యేను సుదర్శనుం డనువిద్యాధరుండ. మదీయప్రకా
రంబు విన్నవించెదనని యిట్లనియె.

181


తే. గీ.

అంగిరసులు కురూపులై యరుగుదేరఁ
గాంచి యే నవ్వఁ దత్పాతకమున నజగ
రంబవై యుండుమనిరి శాపంబు దొలఁగు
మీపదాబ్జంబు సోఁకినమీద ననిరి.

182


వ.

మీకతంబున శాపవిముక్తుండ నైతి నని విద్యాధరుండు యథేచ్ఛంబుగాఁ
జనియె.

183


సీ.

రామకృష్ణులు వనరాజిలో నొకరేయి
                       వెన్నెల గాయ నవీనమధుర
గానామృతము సోనకైవడి వెలయ గో
                       పాంగనల్ పరవశ లైన వారి

  1. దేదివ్యమాన..............శ్రీ లమర మహిమ మెఱసి