పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

నినుఁ జూడనిచూ పేటికి
నినుఁ బొగడనిజిహ్వ యేల నీదాస్యము సే
యనిబ్రతు కేటికి నిత్యము
నినుఁ గొల్వనిజన్మ యేల నీరజనయనా.

160


వ.

అని పలికి.

161


సీ.

సొగసుగా పింఛంబు దిగిచి కొప్పుననున్న
                       యలరుదండలు సిగ నలమియలమి
బెడఁగొప్ప రవికెపైఁ దొడిగించి కడుసొంపు
                       గులుకుసింగారముల్ కూర్చి కూర్చి
తళుకు బంగరుచీర [1]గట్టించి గళమున
                       నవరత్నహారముల్ [2]నవచి నవచి
పూనిక మురళిక పూరింతు మనుచు రం
                       ధ్రాంతరం బొకవింత యాని యాని


తే. గీ.

యాల వీవు మగల మేమ యనుచుఁ దమకు
మగతనంబు లొనర్చుచు మలసి మలసి
నందనందనుఁ డప్పు డానంద మంద
మందగమన లొనర్చి రమందరతులు.

162


సీ.

గుబ్బచన్నులఁ గ్రుమ్మి క్రుమ్మి వైచిననైనఁ
                       దెరలక వెనువెంటఁ దిరిగి తిరిగి
బెళుకు పయ్యెదయును బీతాంబరంబును
                       ముడిగొనఁ బ్రేమతో [3]ముడిచి ముడిచి
కన్నులు మూసిన గళగళ మందుచు
                       దడబా(మా)టుపేరున నొడివి నొడివి
కొప్పు నీడలనంటి కొనవ్రేళ్ళ మడమలు
                       ద్రొక్కుచు సొబగునఁ దూలితూలి


తే. గీ.

పాడుమనఁ బాడి వింతగా నాడుమనిన
నాడి యచ్చోట నిల్వుమ యనిన నిల్చి
యేఁగుమన నేఁగి యామ్రాకు లెక్కుమనిన
నెక్కి తగ హరి వలపించి రిందుముఖులు.

163
  1. యతి తప్పినది.
  2. యతి తప్పినది.
  3. ముడిసి ముడిసి