పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

కలితమదయుతచంచరీకప్రకాండ
బహురవాటోప ముఱుముల బాగు నెరప
జనము సన్నుతి సేయంగ పనము తేనె
వాన గురిసిన మోదము వాసి బెరసె.

140


వ.

ఇట్లు సకలామోదకరంబై పుష్పపరాగరాగాక్రాంతపనాంతంబగు
వసంతంబు విజృంభించుటయు నాకృష్ణుండు గోపికాకలాపంబులతోడ
బృందావనంబుఁ బ్రవేశించె నపుడు.

141


క.

ఎలమావులతావుల దీ
వులపుప్పొడిప్రోవులన్ మిపులఁ దగు మరుమా
వుల నునుబల్కుల దీపుల
దెలివిరిగమితావులన్ [1]సతీతతి యెసఁగెన్.

142


క.

మాఁగినపండ్లకుఁ దేనెలఁ
దోఁగిన మరువిండ్లకును మృదులసుమగంధం
బాఁగిన పొదరిండ్లకుఁ [2]దమి
మూఁగిన తుమ్మెదలకున్ బ్రమోదం బొదవెన్.

143


సీ.

చిగురులు చిదిమిన దగు కేలుకెంజాయ
                       పల్లవస్ఫూర్తులఁ బాదుకొల్పఁ
బువ్వులు గోసిన నవ్వులతేటలు
                       ప్రకటప్రసూనవైభవము నిల్పఁ
దేటులఁ జోఁపిన నీటులౌ చూపులు
                       తుమ్మెదబారులు గ్రమ్మఁ జేయ
ఘనసుమనస్తబకంబులు ద్రుంచినఁ
                       గుచకాంతి క్రొవ్విరిగుత్తులు నుప


తే. గీ.

వనరమాప్తైకభావంబు వన్నె గాంచి
సరస మాధవుఁ డామోదగరిమ మెఱయ
వంజులమరందబృందాంకకుంజతతుల
హాళి విహరించె గోపకన్యాచయంబు.

144
  1. సతీతతి యొసఁగెన్
  2. దము మూఁగిన