పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతాగమము

ఉ.

అంత ధరిత్రిఁ [1]జైత్రకుసుమాయుధయాత్రుఁడు చైత్రుఁ డొప్పె శ్రీ
కాంతవనాంతభాస్వరవికస్వరసూనమరందపానవి
శ్రాంతివిజృంభితభ్రమరఝంకృతిగానవిధానసంభ్రమా
క్రాంతఘనప్రమోదగుణరాజితభోగివరేణ్యమిత్రుఁడై.

136


క.

మావిచిగురాకుడాలను
కావిరి గనుపట్టె నపుడు ఘనవనసీమన్
ద్రావి విరితేనెవానలు
వావిరి నిఁకఁ గురియు ననఁగ వాసి దలిర్పన్.

137


తే. గీ.

పంచశరుఁ డుబ్బఁగా జీర్ణపటము లూడ్చి
సన్నకావులు పూనిన సతులఁ బోలి
పండుటాకు గముల్ రాలఁ బరఁగు నరుణ
కిసలముల నవవల్లరీవిసర మమరె.

138


తే. గీ

పోకుక్రియ నడ్డమై యవి పొంతపంక్తి
యమర భయమందుఁ బాంథమృగాళిఁ బట్టఁ
దలఁచి వైచెనొ పువ్వులవలమనోజుఁ
డనఁగఁ గ్రొవ్విరిజొంపముల్ పని తనర్చె.

139


సీ.

కలయంగఁ బర్వు చీఁకటి [2]మ్రాఁకుగమి చాయ
                       యనత ఘనాఘనఘనత నీనఁ
బల్లవదశపుష్పపటు[3]భాకలాప మా
                       ఖండలచాపంబు దండి చూప
పక్వములై రాలు ఫలములచాలుడా
                       లింద్రగోపమ్ముల యెమ్మెఁ గూర్పఁ
గొదమచిల్కలు రాయఁ జెదరిన యాకోర
                       కంబులు వడగండ్ల [4]పడ పొనర్ప

  1. చైత్రకుసుమాయుధ
  2. మ్రోకగమి
  3. భాక్కలాప
  4. యతి కుదురుట లేదు