పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆస్థానంలో హేమాద్రి అనే పేరుగల మహామంత్రి ఒక డుండేవాడు. ఈహేమాద్రి కటకపురనివాసియైన వామదేవుడనే నామాంతరంగల కామరాజుయొక్క పుత్రుడు. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసవేత్త. గణకులలో అగ్రగామి. ఎంతో ఔదార్యవంతుడు. ఈహేమాద్రి మిత్రుడు మహాపండితు డనిపించుకున్న వోపదేవుడు. ఈ వోపదేవుడు బహుశాస్త్రవేత్తయైన ధనేశపండితుని శిష్యుడు. భిషగ్వరుడైన కేశవుని పుత్రుడు. ఉభయగురువులవల్లనూ అంటే ఇటు తండ్రివల్లనూ, అటు విద్యాగురువైన ధనేశపండితునివల్లనూ వోపదేవుడు బహుముఖప్రజ్ఞానిధి అయ్యాడు. సాహిత్య - వ్యాకరణ - వైద్య - జ్యోతిర్విషయాలలో అనేకగ్రంథాలు రచించిన మహామనీషి. ఈవోపదేవుడు మహాభాగవతం సమస్తస్కంధాలలోనూ వున్న విష్ణురక్షణ - విష్ణుభక్తి - విష్ణుతత్త్వ ప్రతిపాదకాలైన శ్లోకాల నుద్దరించి వాటిని "ముక్తాఫల" మన్నపేరుతో ఒకసంకలనగ్రంథంగా రూపొందించి దానికి "కైవల్యదీపిక" అనేపేరుతో ఒకవ్యాఖ్యానాన్ని రచించి దానికి తనమిత్రుడైన హేమాద్రి పేరు పెట్టాడు. ఈ విషయం కైవల్యదీపికావ్యాఖ్యానంలో వున్న ఈ క్రింది శ్లోకాదులవల్ల తేటతెల్లమవుతుంది.

"విశ్వద్ధనేశ శిష్యేణ బిషక్కేవసూనునా
హేమాద్రి ర్వోపదేవేన ముక్తాఫల మచీకరత్"

"చతురేణ చతుర్వర్గచింతామణి వణిజ్యయా
హేమాద్రిణార్జితం ముక్తాఫలం పశ్యతకౌతుకాత్"

"తేన ముక్తాఫలం తేనే యల్లోక మనుగృహ్ణతా
తత్రటీకాం యథాబుద్ది కుర్వే కైవల్యదీపికామ్"

"ఇహచస్వకర్తృకే౽ పియదురాజమహామంత్రిణా౽భ్యర్థిత ఆచార్యః
(వోపదేవః) తత్కర్తృకత్వం (హేమాద్రి కర్తృకత్వం) ఖ్యాపితవాన్"

"ఇతి శ్రీవోపదేవకృతా ముక్తాఫలటీకా సమాప్తా"

"ఇతి శ్రీహేమాద్రి కృతాముక్తాఫల టీకాకైవల్య దీపికాసమాప్తా"—

ఈవిధంగా వోపదేవ, హేమాద్రినామాలు రెండూ కనిపిస్తున్నా యీరెండింటికర్తాకూడా వోపదేవుడేనని సాధికారికంగా నిరూపితమవుతున్నది. అయితే ఈసందర్భాన్నిబట్టే భాగవతానికీ వోపదేవునికీ వున్న సంబంధమేమిటోకూడా బట్టబయలవుతున్నది. మహాభాగవతంలోని వివిధ స్కంధాలలోవున్న విష్ణులక్షణ - భక్తి - తత్త్వప్రతిపాదకాలైన వివిధశ్లోకాలను సంకలనం చేసి గుదిగుచ్చి "ముక్తాఫల" మన్నపేరుతో రూపొందించడమే తప్ప ఇంతకు భిన్నంగా మహాభాగవతశ్లోకరచనతో వోపదేవునికి సంబంధం లేదని విస్పష్టమవుతున్నది. అయితే ముక్తాఫలంగా