పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

రాసభాకృతి ధేనుకరాక్షసుండు
రా సభాకృతిఁ దూలించి రాముఁ డొడిసి
పట్టఁ జేరి మహోద్భటార్భటి యశోద
పట్టి త్రుంచెఁ దదాప్తోగ్రబలమునెల్ల.

108


తే. గీ.

ఆదిఝషమైన హరియె యాహార మనుచు
మించి బకుఁ డచ్యుతుని నిజచంచువివర
గతునిఁగా మ్రింగ నంతఁ దద్గళము చొరక
వాని వ్రయ్యలుగాఁ జేసె దానవారి.

109


క.

బకుఁ డుచ్చలితారికదం
బకుఁడు భయంకరమహాంధభావవిరూపాం
బకుఁ డర్దనచిత్తాలం
బకుఁ డీల్గినఁ దీవ్రరోషపరవశుఁ డగుచున్.

110


ఆ. వె.

అఘుఁడు వానితమ్ముఁ డరుదెంచి యజగరా
కృతిని దలను మ్రింగఁ గెరలి వాని
నజగరంబువోలె హరి వేగఁ జీరి తా
వచ్చె వత్సపాలవరులకడకు.

111


క.

ఆవనమున నొకనాఁడు మ
హావిశ్వజనీనుఁ డైన హరి పంతంబుల్
గావించి హవ్యవాహక
భావంబున సఖులతోడఁ బన్నిద మాడెన్.

112


వ.

అప్పుడు గోపాలవేషంబునం బ్రలంబుండు బలభద్రు మూ పెక్కించు
కొని చనునంత.

113


శా.

తాలాంకుండు విదారితాహితమదోత్తాలాంకుఁ డత్యుద్ధతిన్
బ్రాలం[1]బాంత్రములెల్ల భూతతతికిన్ బ్రాలంబముల్ చేసె నా
భీలక్రూరభుజాశనిప్రహతిచే భేదించెనే తచ్ఛిర
శ్శైలం బుర్వరఁజూర్ణభావము వహించన్ రాచె దద్గాత్రమున్.

114
  1. బాత్రములెల్ల