పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రొగి నాల్గుమోముల యొజ్జబాపఁడు వచ్చి
                       గొదగొని యంటువోఁ జదివిపోయె
వలికె నెక్కిన బేసియలుగుజేజేదొర
                       వింతగాఁ గొంత దీవించి చనియె


తే. గీ.

నుబ్బు మెఱయంగ ఖగరాగ యోర్తు వచ్చి
తమ్మి కెంగేలఁ ద్రిప్పుచు నెమ్మె చూపి
యేకతంబున గర్భస్థు నేమి చేసి
[1]యేగెనో కాని యంతట నెఱుఁగనైతి.

46


క.

నికటమునఁ గార్ముకముతో
నొకనల్లనిమేనిమేటియువిదయుఁ దానున్
వికవిక నవ్వుచు వరబా
లకుఁ డై యుండంగఁ జూచులాభముఁ గంటిన్.

47


వ.

[2]అక్కట రాత్రి నాకొదవిన యివ్విధంబు కలవలె నున్నది కాని
నిక్కంబ యని మహోల్లాసంబుగాఁ బలికి.

48


సీ.

రవి సింహమున నుండ శ్రావణకృష్ణాష్ట
                       మీనిశీధమున మేలైనరోహి
ణీతారయందు నెన్నిక గ్రహపంచకం
                       బుచ్చస్థమై యుండ యోగిజనులు
బ్రహ్మాదినిర్జరప్రవరులు గొనియాడ
                       శంఖచక్రగదాసిశార్ఙ్గరమ్య
బాహాచతుష్టయప్రకటమాణిక్యకి
                       రీటకుండలశుభశ్రీలు దనరఁ


తే. గీ.

గౌస్తుభాభరణము ఫుల్లకమలలోచ
నములు పీతాంబరము నూపురములు గాంచి
కాంగదంబులు నూత్ననీలాభ్రరుచియు
గల కుమారుని దేవకి గనియె నంత.

49
  1. యేఁగె (సానుస్వారము)
  2. నిక్కట