పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అంత దేవకీదేవి యెనిమిదవగర్భంబు వహించె నప్పుడు.

39


మ.

పరితస్స్విన్నముఖాంబుజాతము గిరిప్రాయీభవత్సమ్మిళ
త్తరళోరోజ మనేకసంగ్రధికహృత్కామంబు కేలీసఖీ
సరసాలాపవిధానము న్ముఖనిజాంచద్భాగధేయంబు త
త్తరుణీరత్నము పూర్ణగర్భమతి చిత్రంబయ్యె నీక్షింపఁగన్.

40


ఆ. వె.

యదుకులోద్వహుఁడు నిజాత్మ నుండఁగఁ బాండు
జాతరుచి వహించె నాతిమోము
గరిమ ధార్తరాష్ట్రగతివిశేషంబులు
నడకఁ గొంచెపఱచె నాఁట నాఁట.

41


క.

తనువుం బ్రాణమునై యా
ఘనుఁడు జగద్వ్యాపి గర్భగతుఁడై యుండన్
దనువు తనువగుట చిత్రమె
తనువయ్యె విభూషణాలి తరళేక్షణకున్.

42


తే. గీ.

మేఘములు నిల్చెఁ గొండలమీఁద ననఁగ
నాతికిని చూచుకంబులు నల్లనయ్యె
ఫలము దీపింప నలసాస్యపాండిమంబు
చిత్రమై కానుపించుచుఁ జెలువు చూప.

43


క.

ఆరయ నానాభీగం
భీరతఁ దూలించునట్టి బిరుదుమగఁడు దు
ర్వారత నానాభీగం
భీరత గర్భస్థుఁ డగుచుఁ బెట్టు హరించెన్.

44


వ.

ఒకనాఁడు దేవకి నెచ్చెలిం జూచి ముచ్చటలన్ మెఱయ.

45


సీ.

తెల్లనిజడదారి దిట్టయై నడురేయి
                       తమిరేగి హెచ్చుగీతములు [1]వాడెఁ
దెరగంటి బోటులు దివినుండి యరుదెంచి
                       చెలఁగుచు ముందటఁ జిందులాడి

  1. వాఁడె (సానుస్వారము)