పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడు శతానీకున కుపదేశించిన ధర్మసారసమ్మిళితమైన భవిష్యపురాణంలో 31 వేల శ్లోకా లున్నాయి. అంబరీశునకు వసిష్ఠమహర్షి వివిధవైష్ణవధర్మాలను బ్రాహ్మ - స్వర్గస్వరూపాన్ని ఉపదేశించిన బ్రహ్మకైవర్తపురాణంలో 12 వేల శ్లోకా లున్నాయి. నందీశ్వరప్రోక్తమై ఈశానకల్పవృత్తాంతసమ్మిళితమైన లింగపురాణంలో 11 వేల శ్లోకా లున్నాయి. విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన వరహావతారమహాత్మ్యం వర్ణించబడిన వరాహపురాణంలో 24 వేల శ్లోకా లున్నాయి. షణ్ముఖప్రోక్తమై మాహేశ్వరధర్మచరిత్రలను వర్ణించిన స్కాందపురాణంలో లక్షశ్లోకా లున్నాయి. త్రివిక్రమమాహాత్మ్యాన్ని త్రిసర్గాలనూ, త్రిమూర్తులనూ వర్ణిస్తూ చతుర్ముఖబ్రహ్మ చెప్పిన వామనపురాణంలో 14 వేల శ్లోకాలున్నాయి. దేవేంద్రుడు తనయెదుట వుండగా మహావిష్ణువు కూర్మావతారంలో మహర్షులకు ధర్మార్థకామమోక్షాలను బోధిస్తూ చెప్పిన పురాణం కూర్మపురాణం. ఈకూర్మపురాణంలో 6 వేల శ్లోకా లున్నాయి. మహావిష్ణువు మత్స్యావతార మెత్తి మనువుకు నరసింహావతారవిశేషాలను గూర్చి చెప్పగా రూపొందిన పురాణం మత్స్యపురాణం. ఇందులో 14 వేల శ్లోకాలున్నాయి. గారుడకల్పంలో విశ్వాండమంతా గారుడోద్భవమే నని విష్ణువు వర్ణించిన విశేషాలతో వున్న పురాణమే గారుడపురాణం. 16 వేల శ్లోకా లిందులో వున్నాయి. బ్రహ్మవర్ణితమైన అజాండమహత్వం కల బ్రహ్మాండపురాణంలో 12 వేల 200 శ్లోకా లున్నాయి. ఈబ్రహ్మాండపురాణంలో భవిష్యత్కల్పాలవృత్తాంతం వివరంగా వర్ణింపబడింది. వివిధపురాణాలన్నింటిలోనూ సర్గప్రతిసర్గాదికర్త శ్రీమహావిష్ణు వని మాత్రమే వర్ణించబడింది. ఈవిషయంలో పురాణాలు "యతోవా ఇమాని భూతా" నీత్యాది వేదవాక్యాలతాత్పర్యాన్ని పురాణాలు ప్రతిబింబించాయనడంలో సందేహ మేమాత్రమూ లేదు. విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడు, విష్ణువే ఆదిత్యుడు. సర్వం విష్ణుమయం జగత్. ఇదే ఏకైకమైన సమస్తపౌరాణికమైన వాక్కు. అష్టాదశపురాణాల్లోనూ, ఇటువంటి ఏకైక అద్వితీయపురుషుణ్ణే వర్ణించడం జరిగింది. ఈ అద్వితీయభావాన్ని అతిక్రమించినవారు నరకం పాలౌతారు" అంటూ మత్స్యపురాణం పేర్కొన్నది. ఈమత్స్యపురాణంలో పేర్కొన్న వివిధపురాణాల శ్లోకాలసంఖ్య సరియైనదని మనం చెప్పలేము. ఈమత్స్యపురాణంలో ప్రక్షిప్తశ్లోకాలు లేవని మనం చెప్పలేము. వాయుపురాణాన్ని బట్టి పరిశీలిస్తే మత్స్యపురాణంలో 14000 - భవిష్యపురాణంలో 14500 - మార్కండేయపురాణంలో 9000 - బ్రహ్మవైవర్తపురాణంలో 18000 - బ్రహ్మాండపురాణంలో 12100 - భాగవతంలో 18000 - బ్రాహ్మ్యపురాణంలో 10000 - వామనపురాణంలో 10000 - ఆగ్నేయపురాణంలో 10600 - వాయువ్య