పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణుపురాణంలోనే పైన పేర్కొన్న పురాణనామాలలోని నారదీయ - బ్రహ్మకైవర్త - వామన - పురాణాలకు మారుగా వాయువ్య - బ్రహ్మవైవర్త - మహాభాగవత - లేదా దేవీమహాభాగవత పురాణాలు పాఠాంతరాలుగా పేర్కొనబడ్డాయి. నారసింహపురాణాన్ని మరికొన్నిచోట్ల పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చూస్తే మహా పురాణాలు 22 వరకూ తేలుతున్నాయని కొంద రభిప్రాయపడ్డారు. అయితే శైవవాయుపురాణాలు ఏకైకపురాణానికే నామాంతరాలని నిర్ణయానికి వచ్చినవారు కూడా లేకపోలేదు.

మత్స్యవిష్ణుపురాణాదులను బట్టి పురాణాల అవతరణ గురించి కొంతవిషయం తెలుస్తున్నది. అది యిది. అయితే ఈమత్స్యవిష్ణుపురాణాదివిషయాల్లో సైతం పొరపాట్లు లేవని ప్రక్షిప్తాలు లేవని సాధికారికంగా చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు.

"కృతయుగంలో బ్రహ్మ శతకోటిప్రవిస్తరం బ్రాహ్మసౌంజ్ఞాత్మకం అయిన పురాణసంహితాస్కంధాన్ని నిర్మించాడు. దానిసారాన్ని వేదవ్యాసుడు నాలుగులక్షలశ్లోకాలకు సంగ్రహపరచి అష్టాదశపురాణసంహితలుగా విరచించి సూతుడైన రోమమహర్షణునికి చెప్పాడు. ఆసూతుడు తనకొడుకైన ఉగ్రశ్రవనునికి బోధించాడు. తరువాత ఆసూతుడే నైమిశారణ్యంలో శౌనకాదిమహర్షులకు ఈఅష్టాదశపురాణాలనూ చెప్పాడు. పురాణాలన్నింటిలోనూ బ్రాహ్మపురాణం మొట్టమొదటిది. బ్రహ్మ మరీచిమహర్షి కుపదేశించిన యీపురాణంలో 10 వేల శ్లోకా లున్నాయి. పద్మపురాణంలో 55 వేల శ్లోకా లున్నాయి. సర్వధర్మాత్మక మనిపించుకున్న విష్ణుపురాణంలో శ్లోకాలు 6 వేలని కొందరూ, 8 వేలని ఇంకొందరూ, 9 వేలని మరికొందరూ, 10 వేలని వేరొకకొందరూ, 24 వేలని మరింకొందరూ అభిప్రాయపడ్డారు. ఈఅభిప్రాయాలన్నీ పాఠాంతరాలవల్ల యేర్పడినవే. అయితే శ్రీధరీయ, విష్ణుచిత్తీయ వ్యాఖ్యానాలతో ముద్రితమై లభిస్తున్న ప్రస్తుతవిష్ణుపురాణంలో 6 వేలు శ్లోకాలు మాత్రమే వున్నాయి. శివమాహాత్మ్యాన్ని వర్ణించేదిగా వాయుప్రోక్తంగా పేర్కొనబడుతున్న శైవపురాణంలో 24 వేల శ్లోకా లున్నాయి. ఇందులో గాయత్రిని సైతం అధికరించి ధర్మం విస్తారంగా వర్ణించబడింది. భాగవతంలో 18 వేల శ్లోకాలున్నాయి. నారదీయపురాణంలో 20 వేల శ్లోకాలున్నాయి. జైమినిమార్కండేయసంవాదరూపమైన మార్కండేయపురాణంలో 32 వేల శ్లోకాలున్నాయి. ఇష్టకాగణనాది అనేకక్రతువిషయాలనూ భృగుమహర్షి చయనోత్పత్తివిషయాలనూ తెలిపిన ఆగ్నేయపురాణంలో 8 వేల శ్లోకా లున్నాయి. వ్యాసమహర్షి శిష్యుడైన సుమం