పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. అటువంటి ఏకైకవ్యవస్థకే స్థానం వుంటే ఈవిభిన్నవర్గాల ఉనికికి అవకాశమే లభించేది కాదు. కాగా విభిన్నదేవగణాలలో తరతమభేదాలతో కూడిన విభిన్నశక్తు లుండవచ్చునని తేటతెల్లమవుతున్నది.

వేదాలు తప్ప, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థవేదం వంటి ఉపవేదాలతోసహా స్మృతులు, ఉపస్మృతులు, పురాణాలు, ఉపపురాణాలు, మాత్రమేకాక, వివిధవిభిన్నబహుముఖశాస్త్రీయగ్రంథాలన్నీ లౌకికవాఙ్మయంగానే రూపొందాయి. స్మృత్యుపస్మృతి, పురాణోపపురాణాలు అష్టాదశసంఖ్యకే పరిమితం కావడం చూస్తే అత్యంతప్రాచీనకాలంలో ఇతిహాసనామకగ్రంథాలు సైతం 18 అవతరించి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయేమో అనిపిస్తున్నది. ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలు కొన్ని కొన్ని వేదమంత్రాలకు వ్యాఖ్యారూపంగా అవతరించిన గ్రంథాలైనందువల్ల వాటిల్లో అష్టాదశసంఖ్యాపూర్వకమైన విభజనకు అవకాశం లేకుండాపోయింది.

అయితే అసలు దేవగణాలే 18 విధాలని ఆమోదించినపుడు దేవవేదవాక్కులైన శ్రుతులుసైతం 18 విధాలుగా యెందుకు విభజింపబడలేదని కొందరికి సందేహం కలుగవచ్చును. "అనంతా వై వేదాః" అని మొట్టమొదటే పేర్కొనడం జరిగిందిగదా! దేవగణాలనైతే 18 వర్గాలుగా వున్నట్లు తమదివ్యదృష్టికి కనిపించడంవల్ల ప్రాచీనవేదర్షులు విభజించారు తప్ప, దైవీయాలైన అనేకకోట్లాదిగాగల, అనంతశక్తులను 18 వర్గాలుగా విభజించే అవకాశం వొక్కఆర్షవిజ్ఞానం దృష్ట్యానే కాదు, ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశోధించినప్పటికి కూడా అణుమాత్రమైనా లేదు. వేదాలు బహుముఖాలై అనంతాలైన దైవీయాలైన శక్తులను ప్రతిబింబించే బహుళార్థదాయకాలు కాగా వేదాలను 18 భాగాలుగా విభజించడానికి బొత్తిగా అవకాశంలేదు. అనేకార్థదాయకాలైన వేదమంత్రాలను వొక్కొక్కవిశిష్టదృక్కోణంతో పరిశీలించడంవల్ల ఆపరిశీలకుల దృష్టికి గోచరమైనవిధంగా ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, అర్థవేదాలవంటి పరిమితార్థదాయకాలైన ఉపవేదాలు లౌకికంగా అవతరించాయేగాని అవి చతుస్సంఖ్యకే పరిమితం కావాలని యెక్కడా లేదు. అవి అష్టాదశసంఖ్యకు పరిమితం కావాలనికూడా యెక్కడా లేదు. పైగా "అనంతా వై వేదాః" అన్నట్లు బహుముఖార్థదాయకాలుగా విభిన్నాలుగా, ఉపవేదా లవతరించాలంటే అనంతాలుగానే కాదు అనంతానంతాలుగా అవతరించవలసి వుంటుంది. దైవీయాలైన ఆర్షశక్తులను విభిన్నదృక్సథాలతో ఆలోచించినప్పుడు వాటి అగాధత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఒక్క ఆర్షవిజ్ఞానం దృష్ట్యానే కాదు. ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశీలించినప్పటికీ మనం అయోమయంలో పడక