పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారకం - సింహళం - కైవల్యం - మలయం - అశ్వభద్రం - కేతుద్వీపం - మాల్యవంతం - పుష్కరం - వృషభం - రైవతం - నిమ్నోచనం - నియామ్యం - పారావారం - చౌరకృతం - మాల్యద్వీపం - గోభిద్వీపం - అని పేర్లు పెట్టారు. కొందరు రమణకద్వీపాన్ని 'రమళిక'ద్వీపంగా పేర్కొన్నారు. ఈభూమండలంమీద వున్న పాపప్రణాశకాలు, అత్యంతపుణ్యప్రదాలైన తీర్థాలు కూడా 18 కే పరిమితమైనట్లు ఆర్షవిజ్ఞానులు పేర్కొన్నారు. ప్రస్తుతం తీర్థాలుగా భావిస్తున్న పెక్కుపుణ్యస్థలాలు వీటిల్లో లేనేలేవు. ఆర్షవిజ్ఞానులు పేర్కొన్న 18 పవిత్రమహాతీర్థాలు యివి. అంతర్గంగ - పాపనాశని - ప్రథమబ్రహ్మ - ఛాయామల్లికార్జున - వేదసంగమేశ్వర - గణికాసిద్దేశ్వర - మోక్షేశ్వర - భుజంగ - బ్రహ్మనారాయణ - మణికర్ణిక - ప్రయాగ - మాధవ - సోమసిద్దేశ్వర - దేవద్రోణ - నాదాతుంగసంగమ - కులకేశ్వర - నాగభోగేశ్వర - శుక్లేశ్వర - అగ్నేశ్వరమహాతీర్థములు.

కేవల తీర్థాలుమాత్రమే కాదు ఆదిశంకరాచార్యులు శక్తిపీఠాలు స్థాపించారని కొందరంటున్నారు కాని, అవి ఆదిశంకరాచార్యులవారికాలంలోనే స్థాపించబడినవని నిరూపించడానికి పూర్తి అవకాశాలు లేవు. అయితే వాటిని యెవరు యెప్పుడు నిర్మించారో చెప్పలేము కాని శక్తిపీఠాలుసైతం అష్టాదశసంఖ్యకే పరిమితాలై నిర్మింపబడ్డాయి. ఈ 18 శక్తిపీఠాలు యివి - శ్రీలంకలో శాంకరీపీఠం - కంచిలో కామాక్షీపీఠం - మధురలో మీనాక్షీపీఠం - కాళహస్తిలో జ్ఞానప్రసూనాంబాపీఠం - ప్రద్యుమ్నస్థలంలో శృంఖలాపీఠం[1] - క్రౌంచపట్టణంలో చాముండీపీఠం[2] - అలంపురంలో జోగులాంబాపీఠం - శ్రీశైలంలో భ్రమరాంబాపీఠం - ఉద్యానపట్టణంలో (విరజా)గిరిజాదేవిపీఠం[3] - పిఠాపురంలో పురుహూతిపీఠం - మాణిక్యపట్టణంలో చిత్రకోటికాపీఠం - హయశ్చిత్ర(అపాచ్ఛత్ర)పురంలో కామరూపిణి(కామాఖ్య)పీఠం[4] - ప్రయాగలో మాధవీపీఠం[5] - కొల్లాపురంలో మహాలక్ష్మీపీఠం[6] - జ్వాలాపట్టణంలో జ్వాలాముఖీపీఠం[7] - వాసరాపట్టణంలో సరస్వతీపీఠం - కాశీలో అన్నపూర్ణా

  1. ఇప్పుడు బెంగాల్ దేశంలో పాండ్వాప్రాంతంలో వున్నది.
  2. ఇది పశ్చిమసముద్రతీరంలో వున్నది.
  3. వైతరణినదీతీరంలో ఇప్పటి జాజిపూర్ సమీపంలో వున్నది.
  4. ఇది అస్సాం రాష్ట్రంలో వున్నది.
  5. దీని నిప్పుడు అలోపీశాంకరీపీఠం అంటున్నారు.
  6. ఇది బొంబాయి రాష్ట్రంలో వున్నది. కరవీరపురంగా పేర్కొనబడింది. ఇదే కొల్హాపూర్.
  7. కాంగ్రా ప్రాంతంలో వున్న దీనిని వైష్ణవీపీఠంగా సైతం పేర్కొనడం జరుగుతున్నది.