పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-5 సామంతం-ఏకతాళి సంపుటం: 11-599

పల్లవి: నీమతకము లన్నియు నే నెరఁగనా
         యేమి దలఁచుకొంటివో యింతలో నవ్వితిని

చ. 1: పిలిచినప్పుడె రాక పెనఁగి పెనఁగి నాతో
       బలిమి వచ్చిన రాక పట్టఁ బనేది
       అలుక సేసుకొంటివి అక్కడికిఁ బోవలసి
       తెలుసుకొని యేఁటికో తిరిగి వచ్చితివి

చ. 2: తప్పక నేఁ జూడఁ గాను తల వంచి వంచి నీవు
       యిప్పుడు నీవు చూచితే నియ్యకొందునా
       అప్పుడే వెఱచితి వేయంగన గనునో యంటా
       కొప్పు మాఁటు సేసుకొని గొబ్బునఁ జూచితివి

చ. 3: చెనకినప్పుడె లోఁగి చేతులఁ దప్పించుకొని
       వెనక నన్నుఁ గూడితే వింత మానునా
       అనుఁగు శ్రీవెంకటేశ అలమేలుమంగ నని
       మన సిచ్చి యిప్పుడు గా మగుడఁ గూడితివి