పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-4 ఆహిరి సంపుటం: 11-598

పల్లవి: గక్కన నాతనిఁ గని గడ్డము వట్టి వేఁడుక
         చెక్కు నొక్కినపుడుగా చింత లెల్లఁ బాసును

చ. 1: యే మని దూరితినో యెంత చిత్తము నొచ్చెనో
       ప్రేమాన నాతఁడు నన్ను బిలిపించఁడు
       మోము చూచి తనకు నేమొక్కే నన్నా నిందురాఁడు
       ఆమని విరహతాప మడ్డ మేల వున్నదే

చ. 2: పాదము లొత్త నైతినో పంత మేమి యెంచినాఁడో
       నాదెస చూడఁ జెలి నైనా నంపఁడు
       ఆదరించి వచ్చే నంటే నట్టె తెల్లవారదు
       సాదించి నావలపులే చలముతో నున్నవి

చ. 3: నివ్వెరగుతో నుంటినో నెప మేమి గలిగెనో
       నవుచుఁ గాఁగిట నించి నాలి సేసీని
       యివ్వల శ్రీవెంకటేశుఁడే నలమేలుమంగ
       నువ్విళ్లూర నన్నుఁ గూడె నొద్దెనె దాఁగీని