పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-2 దేసాక్షి సంపుటం: 11-596

పల్లవి: ఇంక నెన్నఁ డమ్మ నీ యెన్నిక జాణతనము
         జంకించి మాటాడకున్న సతులఁ గైకొందురా

చ. 1: సూటిగా నిన్నుఁ దప్పక చూచీ నాతఁడు
       వాఁటముగఁ దల యెత్తి వంచుకొంటాను
       చీటికి మాటికిఁ దానె సెలసి సెలసి నవ్వీ
       నాఁటదాన వాతనితో నౌఁ గా దనకుందురా

చ. 2: వేమరుఁ జేయి చాఁచి వేఁడుకొనీ నాతఁడు
       సోమరించి దారిమొనాఁ జూపి చూపి
       నేమములుఁ బచరించి నెలఁత లంటేఁ జెనకీ
       చే ముంచి యాతని నీవు చిమ్మిరేఁచ కుందురా

చ. 3: సిగ్గు విడిచి కూడెను శ్రీవెంకటేశుఁడు
       వొగ్గి తల రాయి సేసు కూర కైనాను
       నిగ్గుల నలమేల్‌మంగ ని న్నతఁడు గలసెను
       వెగ్గళించి నీవలపు వెదచల్ల కుందురా