పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-1 భూపాలం సంపుటం: 11-595

పల్లవి: అంతయను నిన్నుఁ బొందేయందుకొరకే
         వింత సేసుక యిందుకు విసిగేవు సుమ్మీ

చ. 1: అంకెకు రానివేళ నాడుదు మే మైన నిన్ను
       పొంకము వచ్చినవేళ పొగడుదుము
       సంకె లేని మావంటి సతులకు నిది వోజ
       పంకించి నీ విందు కెగ్గు పట్టేవు సుమ్మీ

చ. 2: బగి వాసి వున్న వేళ పగ చాటుదుము నిన్ను
       మొగము చూచితేనె మొక్కుదుము
       యెగసక్కేలె మావంటి యింతులకు సహజము
       అగ డైతి నని నీవు అలిగేవు సుమ్మీ

చ. 3: తక్కించినప్పటివేళ తరిఁ జలపట్టుదము
       గక్కనఁ గూడితేనె కరఁగుదుము
       దక్కితి శ్రీవెంకటేశ తతి నలవేల్‌మంగను
       వొక్క టైతి విది నాకు వొడఁబాటే సుమ్మీ