పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-6 ముఖారి సంపుటం: 11-594

పల్లవి: నీ కెదురు చూచి చూచి నెలఁత నన్నంపె నిదే
         రాకుండితే నాపె వచ్చీ రావయ్య నీవూ

చ. 1: అప్పుడు నీ వాన వెట్టినది నమ్మినది గాక
       తప్పులు వట్ట నేర దాతరుణి నిన్ను
       నెప్పున నీ విందుకుఁ గా నీవేల వెరచి రావు
       చెప్పేఁ గాని యింటికి విచ్చేయవయ్యా నేఁడు

చ. 2: నీసుద్దుల కెల్ల నాపె నెట్టన నోరిచెఁ గాక
       సేసే నంటే నీ వింతిచేఁతకు వేలె
       పాసి యిందుకుఁ గా సిగ్గుపడి యీడఁ గొంక నేల
       సేసతో మాయింటికి విచ్చేయవయ్య ఘనుఁడా

చ. 3: ముంచి యలమేలుమంగ మొకమోడి కూడెఁ గాక
       వంచే నంటే నాపె నీతో వాదు వెట్టదా
       యెంచుక శ్రీవెంకటేశ యిందుకుఁ గా నవ్వ వేల
       చించితి మాట యింకా విచ్చేయవయ్య యింటికి