పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-5 సామంతం సంపుటం: 11-593

పల్లవి: అప్పు డెంత లే దని నీ వాన వెట్టినా నమ్మదు
         ముప్పిరి నాకుఁ గా నింద మోవ నీకు నేఁటికి

చ. 1: పట్టకురా నీవు మమ్ముఁ బలుమారు నీచేతుల
       వెట్ట గాఁగినది మేను విరహనను
       అట్టె నెవ్వతె నైన నంటఁ బోతే నాపె మరి
       వట్టిసందేహలు నీపై వడిఁ జుట్టుఁ జమ్మీ

చ. 2: మాటలాడకురా నీ నా మనసులు గలయఁగ
       గాఁటపు నామన సెల్లఁ గలఁగినది
       యీటున నాకలఁక నీ కిట్టె అంటితేఁ గనక
       నాటకుఁడ వ నెవ్వతె నవ్వకుండుఁ జుమ్మీ

చ. 3: చూడకురా నాచన్నులు జొబ్బిలీఁ జెమటచేత
       జోడుగా శ్రీవెంకటేశ సోఁకి నిన్నును
       కూడితిని నన్ను నిట్టె కోరి యలమేల్‌ మంగను
       యెడ నెవ్వ తైన నిన్ను నిఁక నవ్వుఁ జుమ్మీ