పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-4 కేదారగౌళ సంపుటం: 11-592

పల్లవి: ఇప్పుడే వేరిగ మేల యిందుకుఁ గాను
         వొప్పగించితిమి వల పోపరో విభుఁడా

చ. 1: నయగారినీమాటలు నమ్మకుండ నెట్టు వచ్చు
       రయమును నీవా రైనరమణులకు
       ప్రియము నీవు చెప్పఁగ బిగియఁగ నెట్టు వచ్చు
       దయ నీకుఁ గలితేను తానే వచ్చీఁ గాకా

చ. 2: నంటున నీవు నవ్వఁగ నవ్వకుండ నెట్టు వచ్చు
       జంట లైన సేసపాలసతులకును
       వెంట నీవుదిరుగఁగ విడువఁగ నెట్టు వచ్చు
       యింటికి విచ్చేసినప్పు డెనసేము గాకా

చ. 3: చేరి కాఁగిలించుకోఁగా సిగ్గువడ నెట్టు వచ్చు
        కోరి నీ కెదురు చూచేకొమ్మలకును
        ఆరయ శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       యీరీతిఁ గూడఁగ నిన్ను నియ్యకొనేఁ గాకా