పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-6 భవుళి సంపుటం: 11-588

పల్లవి: యోగి భోగి నటనం కురు వుల్లాసాననమోహన
         సాగరోద్భవకన్యకాపతి సారస శ్రీవెంకటగిరియోగి

చ. 1: లీలా నక్షత్రజాలాధికరండ
       మాలాత్రైవిక్రమాకారయోగి
       హలాహలకర కోలాహలకర
       శూలాయుదవంద్య పరిపూర్ణయోగి
       కాళివినుత ప్రహేళిచరితాహి
       మౌళిఘనసారవిన్యస్తయోగి

చ. 2: గరుడపక్షివాహగమనవిహరి
       గురునాగశైలేశ గోరక్కు రే
       మురళీనాదశృంగ మోహనమురారి రే
       కరుణానందసాగరశాయి రే
       పరమ శ్రీవెంకటపతియవతార
       నరరూపగోపకానాథ గోరక్కు రే