పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-4 సారంగనాట సంపుటం: 11-586

పల్లవి: ఎటువంటి చుట్టమే నా కెంత కలసినవాఁడే
         సటలు సేసి వీని చంద మేమి చందమే

చ. 1: అలుక సేసుక నేనే అవ్వలిమో మై యుండఁగ
       పిలిచీ నూరక నన్నుఁ బేరుకొని
       పలుక కుండఁగఁ దానె పకపక నవ్వుకొంటా
       నిటుచున్నాఁ డిదె వీనినేరు పేమి నేరుపే

చ. 2: ముడిపడ్డ బొమలతో ములుగుతా నుండఁగాను
       తడవీ నూరక నన్నుఁ దతి గొని
       చిడుముడితో నుండగఁ జేతులు చాఁచుకొంటా
       వొడివట్టి నన్నుఁ దీసీ వోరు పేఁటి వోరుపే

చ. 3: పట్టినచలముతో నేఁ బవళించి వుండఁ గాను
       వొట్టుక దగ్గరి నామై వొళ్లు వేసీని
       అట్టె శ్రీవెంకట్టతి అలమేలుమంగ నేను
       తిట్టఁగానె కూడె వీనితెగు వేఁటి తెగువే