పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-3 లలిత సంపుటం: 11-585

పల్లవి: ఎంత మొగ మోడి యున్నా నెఱఁగవు నీయంత
         పొంతనె నా కిఁక నీవు బుద్ది చెప్ప వలెనా

చ. 1: మనసు నొవ్వదు గదా మాటలాడే నీతోను
       విను నిజ మాడెటి వెఱ్ఱిదానను
       తనివోక వాడవారిఁ దమకాలు రేఁచి వచ్చి
       యెనసి నాతో నవ్వేవు యేది నిజ మయ్యా

చ. 2: సిగ్గు వడవు గదా చెలులఁ దారుకాణించే
       కగ్గి కల్ల కోరువనిగబ్బిదానను
       వెగ్గళించి వీరి వారి వెంటనె పెట్టుక వచ్చి
       అగ్గ మైనవాఁడ నంటా నాన వెట్టే వయ్యా

చ. 3: నెలవి నవ్వవు గదా చేతిలోనే వాసి చూపే
       వలచి యెగ్గెంచని భావపుదాననూ
       కొలఁది మీఱఁగ నన్నుఁ గూడితి శ్రీవెంకటేశ
       అలమేలుమంగను నే నట్టె కావవయ్యా