పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-2 హిజ్జిజి సంపుటం: 11-584

పల్లవి : బోన మెల్లా జల్ల నారి పొద్దు వోయను
          పూని నేము నీ కెట్టె బుద్ది చెప్ప వలెనా

చ. 1: పొత్తుకు నీవు రమ్మంటేఁ బొలిఁతి దా సిగ్గువడి
       చిత్తములోఁ గొంకి కొంకి చెక్కు చేఁ బెట్టి
       హత్తి యాపెకు నీ మీఁద నాన లేల పెట్టేవు
       బత్తి గలితేఁ జేయి వట్టి తియ్య రాదా

చ. 2: కడి సేసి చేతి కియ్యఁగా నింతి నవ్వుకొంటా
       చిడుముడి మారుమోము సేసుకొని
       అడరి రాదాయ నంటా నాపెతో నలుక లేల
       కడు నీకు వేడు కైతే కమ్మి మొక్క రాదా

చ. 3: సతిఁ గాఁగిలించి పట్టి చవులు నోటి కియ్యఁగ
       రతి బువ్వ మారగించి రమణి మెచ్చె
       యిత వై శ్రీవెంకటేశ యీ యలమేలుమంగను
       మతకానఁ గూడితివి మరి వేళ లేదా