పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-1 లలిత సంపుటం: 11-583

పల్లవి: మానవు నీవోజ లింకా మా కేల యింత
         కానీలే మగవాఁడవు కాకు సేసేవా

చ. 1: వాసికి నీమీఁద నేను వలపు చల్లితిఁ గాక
       యీసుల యెగసక్యాన కింత నవ్వేనా
       చేసిన నీచేఁతలు సిర సూఁచుకొంటిఁ గాక
       పాసినతమకానకుఁ బగ చాటేనా

చ. 2: యిచ్చగించి నీపైఁ జేయి యిట్టె నే వేసితిఁ గాక
       చొచ్చి నీమేనిగురుతు చొప్పు లెత్తేనా
       మెచ్చి నీ వీపనులకు మేఁటి వని యుంటిఁ గాక
       విచ్చనివిడిగా నిన్ను వెంగె మాడేనా

చ. 3: కందువకు నీవు రాఁగాఁ గాఁగిట నించితిఁ గాక
       అంది నిన్ను బలిమి సేయఁగ వచ్చేవా
       అందపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       విందువలెఁ గూడితివి వేసరించేనా