పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-5 రామక్రియ సంపుటం: 11-581

పల్లవి: వేళ గానివేళ వచ్చి వెదకేవు
         యేలినరమణునితో నింత రట్టు గలదా

చ. 1: యేచిన నీనాయకుఁడు యింట నున్నాఁ డంటావచ్చి
       చూచేవు నలుదిక్కులు సోదించి
       యీచాయ నుండె నాతఁడు యిట్టె పిలుచుక వచ్చేఁ
       గూచుండవమ్మా నీవు కోపగించుకొనకా

చ. 2: వొద్ద నెవ్వతెఁ బెట్టుక వున్నాఁడో యనుచు
       నద్దమరేతిరి పొంచు లాలకించేవు
       నిద్దురతో నెం దున్నాఁడో నే నతనిఁ దోడితెంచే
       వద్దు వీడె మిందవమ్మ వట్టిచల మేఁటికి

చ. 3: మామాట వినక నీవు మాడుపుటింటిలో చొచ్చి
        కామించి శ్రీవెంకటేశుఁగని కూడితి
       యే మమ్మ అలమేల్‌ మంగ యింటికే యీతనిఁ దెచ్చే
       ప్రేమాన నా వెంట రావో పెనఁగించుకొనకా