పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-4 కన్నడగౌళ సంపుటం: 11-580

పల్లవి: ఎట్టు సేసినా నీచిత్త మింతే కాక
         తట్టి నిన్ను వెగ్గళించఁ దగునా మాకును

చ. 1: మంతన మాకెతో నాడి మరి నన్నుఁ గని లేచి
       చెంత నా కిచ్చక మాడి చెక్కు నొక్కేవు
       యింతటి మగవాఁడవు యేల నీ కింత వెఱపు
       కాంతలము యేమి సేయఁ గల మయ్య నిన్నును

చ. 2: యిద్దరూఁ గూ డుండఁగాఁ జూ చిట్టె నేఁ దిరిగి రాఁగా
       గద్దించి నాకొంగు వట్టి గడె వెట్టేవు
       వుద్దండీఁడవు మాతోడ నూర కనుచర ణేల
       అద్దో వూడిగపువార మవుఁ గా దనేమా

చ. 3: యిట్టె యాచెలియఁ గూడి యే మైనాఁ జేసుకొమ్మని
       వొట్టుక నాపైఁ దెచ్చి వొళ్లు వేసేవు
       నెట్టన శ్రీవెంకటేశ నే నలమేల్మ౦గను
       ఱట్టడి నిన్నుఁ గూడి యాఱడికి నోపుదుమా