పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-3 మాళవి సంపుటం: 11-579

పల్లవి: పో పో నీపొందు చాలు పొసగ దిఁక
         వైపు గా దనుచు నాతో వడిఁ బోరాడేనా

చ. 1: అప్పుడే ఆపెమాఁటకు నదలించ వలదా
       విప్పుచు నన్నుఁ దిట్టఁగా విందురా నీవు
       చెప్ప నేల నీతోడిచెలి మేఁటి చెలిమి
       ముప్పిరి చుట్టమ వంటా మొగము చూచేదా

చ. 2: మచ్చరాన నవ్వఁ గాను మానుపంగ వలదా
       వొచ్చాన నావేళ నా పెవొద్ద నుందురా
       యిచ్చకాన నీకు నాకు నేఁటి మొగమోట మింక
       వచ్చినదే పదివేలు వాదులాటే చాలును

చ. 3: పొత్తునఁ గూచుండితేను పొ మ్మనంగ వలదా
       అత్తల సరి నేతురా ఆపెను నన్ను
       అత్తిన శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       బత్తితో నన్నుఁ గూడితి పంత మేఁటి పంతమూ