పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-2 కాంబోది సంపుటం: 11-578

పల్లవి: ఇట్టె వీడె మందుకోవు యెందాఁకాను
         పట్టపగలే వచ్చితి పరా కేఁటి కోయి

చ. 1: కంటికి నిద్దుర రాక కాచుకుందాన నీరాక
       యింటికి రా వే మోయి యెందాఁకనూ
       జంట లైనసతులతో జాణతనా లాడఁ బట్టె
       వెంటనే తిరుగ కనువేళ గాన నోయీ

చ. 2: నెయ్యమున విందు చెప్పి నే నీకు మొక్కఁగాను
       యియ్యకొన వే మోయి యెందాఁకనూ
       యియ్యెడ నందరితో నీ కేకతా లాడనే పట్టె
       అయ్యో నిన్ను నిష్ణూరము లాడ నేర నోయీ

చ. 3: కంకి నేసి రతులను కాఁగిటఁ గూడితి నిన్ను
       యింకాఁ దనియ వే మోయి యెందాఁకను
       అంకెల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       సంకె లేదు వురుముపై సత మైతి నోయి