పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-6 రామక్రియ సంపుటం: 11-576

పల్లవి: ఇంత వెల్లవిరి గద్దా ఇంతుల వలపు లెల్లా
         కాంతునికి నొప్పగించి కాకు సేసేవూ

చ. 1: అందుపుఁజెక్కులతోడి యలమేలుమంగ నీ
       వంది కైలా గియ్యవయ్య ఆతినికిని
       కందువ కన్నులఁ జూచె కరఁగి వుందానవు
       యిందుకే యీతఁడు నవ్వీ నిది గదవమ్మా

చ. 2: బంగారువన్నెలతోడిపడఁతి
       సంగతి నీపతికొప్పు చక్కఁ బెట్టవో
       ముంగిట నాతఁ డుంటెనె మురిసేవూ
       చెంగట నాతఁ డేసుద్ది చెప్పీఁ జెలులకూ

చ. 3: కప్పురపువాసనకలికి
       యిప్పుడె శ్రీవెంకటేశు నెనసితివి
       తప్పక చూచి మఱియుఁ దమకించేవూ ఆతఁ
       డప్పటి నిందుకు లో నాయఁ గదవమ్మా