పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-5 సాళంగం సంపుటం: 11-575

పల్లవి: కొమ్మలాల అమ్మలాల గోవిందరాజు మీపాల
         నిమ్ములఁ జి క్కున్నే వాఁడు యిక నే మమ్మా

చ. 1: పరపుమీఁద నూరక పవళించుండుట గాని
       నిరతి మీవిభునికి నిద్దుర లేదు
       పరగ మీ రిద్దరును పాదములు పిసుకఁగ
       సురతమర్మపుఁ గాఁకఁ జొక్కీ నదే

చ. 2: వున్నతితోఁ గొలు విచ్చి వుండుట యింతే కాని
       కన్నులచూపు మీపైనే కదరమ్మా
       మన్ననసతులు మీకు మాట లిట్టె యాడఁ గాను
       విన్నవినకుల మెచ్చి విఱ్ఱవీఁగే నదివో

చ. 3: పూఁచి భుజములు మూఁడై పొరలి వుండుట గాని
       చాఁచినకరము మీకే సన్న సేసీని
       ఆఁచి శ్రీవెంకటగిరి నదె తిరుపతిలోన
       రేంచినమోహన గూడె రేయిం బగ లదివో