పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-4 శంకరాభరణం సంపుటం: 11-574

పల్లవి: ఏమి గంటివి నావల్ల నిట్టె కాచుక తిరిగి
         ఆమీఁదఁ గదా నిన్ను నట్టె మరిగితిని

చ. 1: వుపచిరించ నేరక వూర కున్న నాపై నొక్క
       నెపానఁ బాదాలు చాఁచి నీవే మెచ్చేవు
       యెపుడూ సరస మాడ నెరఁగని ననుఁ దెచ్చి
       వుపమల నాచేయి నీవొళ్లిపై వేసేవు

చ. 2: దవ్వుల నే నూర కున్న దగ్గరఁ బిలిచి నీవే
       నవ్వులు నవ్వి ననుపు నటియించేవు
       జవ్వనపు సిగ్గుతోడ సరిఁ దల వంచుకొంటే
       చివ్వన నామొగ మెత్తి చెక్కు నొక్కేవూ

చ. 3: మాట లాడ కుండితేను మంతనము గడియించి
       నీటున మందెమేళాలు నీవే సేసేవూ
       గాఁటపు శ్రీవెంకటేశ గక్కనఁ గూడితి నంటా
       మాటికి మాటికి నన్ను మన్నించేవూ