పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-3 శుద్దవసంతం సంపుటం: 11-573

పల్లవి: పలుకవే చెలియా పంత మెచ్చెనే
         చలి వాసి నీవలపు చవు లెక్కెనే

చ. 1: నీ వెంత గోపగించి నేరుపుతోఁ దిట్టి నాను
       వావిరి నిండా నవ్వు వచ్చీనె నాకు
       కావిరితో నీ వెంత కాఁకా దేరఁ జూచినాను
       మూవంకఁ దమకమే ముంచీ నాకు

చ. 2: పూఁచి పట్టి నీ వెంత బొమ్మల జంగించినాను
       చాఁచి మందెమేళములు జూజుకొనీనే
       రేఁచి నీవు నన్నుఁ గడు రేసు లెంత వుట్టించినా
       తూఁచినట్టు కళ లెల్లా తుద ముట్టెనే

చ. 3: కాతరించి నీ వెంత కాఁగిట బిగించినాను
       యీతల నా కంత కంత కింపు వుట్టెనే
       యేతులకు శ్రీవెంకటేశుఁడ కని కూడితి
       నీతలఁపు నావలెనె నేర్పున రూ పాయనే