పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-2 సామంతం సంపుటం: 11-572

పల్లవి: రాజసపుదాన నంటా రవ్వ సేసేరు గకన
         వోజ నా కిటువంటిదె వూహించుకొనరే

చ. 1: వొలిసీ నొల్లమితోడ వూరకె తా నుండఁ గాను
       బలిమి సేసి పెనఁగఁ బాడి యౌనా
       పిలిచినప్పుఢు మరి ప్రియముతో వచ్చేఁ గాని
       తలఁగి లోననే వుండేఁ దతి యెరిఁ గుండరే

చ. 2: పంతము ముంగిట వేసి పరాకుతో నుండఁ గాను
       పొంతఁ జేసన్నలు చూప బుద్ది వుట్టునా
       చింతతోఁ గావలె నంటే చెప్పినట్టు సేసేఁ గాని
       మంతనానఁ బండి వుండేమన సెరిఁ గుండరే

చ. 3: బయలు మెరసి తానె పైకొని న న్నంటఁ గాను
       నయ మిచ్చి కూడ కున్న నాయమా నాకూ
       క్రియతో శ్రీవెంకటాద్రిగిరి నితఁడె కూడె
       దయ తనపాటి నాకు తగ వెరిఁ గుండరే