పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0396-1 లలిత సంపుటం: 11-571

పల్లవి: ఏ మయ్య రమణుఁడ యెంత సేసేవూ
         భామ నిన్నుఁ దలపోసీఁ బైకొనుదాఁకాను

చ. 1: చింతలచిగురు గోసీఁ జిత్తములోనఁ
       గాంతుఁడ ని న్నెదుటనుఁ గన్నదాఁకాను
       పొంతఁ బ్రియములఁ జేసీ బోనాలు
       సంతతపు వలపుల చవి గొనుదాఁకాను

చ. 2: వెదచల్లీఁ జీఁకటులు వేనలివెంట
       అదె నీవిరహతాప మాఁపఁగ లేక
      తుదుచూపులనె కట్టె దోరణాలు
      వదలక నీ వింటికి వచ్చినదాఁకానూ

చ. 3: ముగ్గులు వెట్టీఁ జెమటుమత్తెములను
       అగ్గ మై నీవు తనుఁ బెం డ్లాడుదాఁకాను
       సిగ్గుదేరఁ గూడితివి శ్రీవెంకటేశ
       అగ్గల మై నీకు మొక్కె నట్టె యిందాఁకానూ