పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-6 హిందోళం సంపుటం: 11-570

పల్లవి: కామిన యప్పటినుండి కాచు కున్నది
        యీ మోహ మోఱఁగ కున్న నెగ్గు వట్టుఁ జుమ్మి

చ. 1: చక్కఁ జూడ రాదా సతి నిన్నుఁ జూడఁ గాను
       యెక్కడో పరా కై యేమి సేసేవు
       మొక్కి నాపెవిద మెంత ముంచి నీరాజస మెంత
       తక్కు లిఁక మాన కున్న తమకించుఁ జుమ్మీ

చ. 2: మాట లాడ రాదా మగువ నిలుచుండఁగ
       నేఁటికి నీకుచ్చితము లేల చూపేవు
       మేఁటి యాపెప్రియ మేడ మించిన ఈ బలు మేడ
       నీటుతో మన్నింప కున్న నేరమి యౌ జుమ్మీ

చ. 3: చిత్తగించ రాదా చెలి వద్దఁ గూచుండఁగ
       యెత్తిన నీ యెమ్మె లింక నేల మానవూ
       పొత్తుల శ్రీవెంకటేశ పొందితి వీపె నింతట
       హత్తి యిట్టె వుండ కున్న నాఱడి యౌఁ జుమ్మీ