పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-4 శుద్దవసంతం సంపుటం: 11-568

పల్లవి: చెల్లఁబో నామన సింక సిగ్గు వడదు
         పల్లదాన నీకు నేల భ్రమసితినో

చ. 1: అడరి నీవు మొక్కఁగా నాపె నిన్నుఁ దిట్టఁ గాను
      నడుమ నూరకే నాకు నవ్వు వచ్చెను
      వడిఁ జనవు గలట్టివారు ని న్నేమి చేసినా
      తడవి నీపై నా కేల దయ వుట్టెనో

చ. 2: చెఱఁగు నీవు ముట్టఁగ చేతు లాపె దొబ్బఁ గాను
       కఱకుఁ బెంజెమటలు గారీ నాకు
       గుఱి యైనవారు నీతో గొడవలు వెట్టుకుంటే
       అఱిమఱి నే నేల అడ్డము వచ్చితి

చ. 3: కాని మ్మని యాపె రాఁగా కాఁగిట నీవు నించఁగా
       తానక మై నావలపు తల కెక్కెను
       దీనికె కా నన్నుఁ గూడితిని శ్రీవెంకటేశుఁడ
       కానీ లే నీ కెంత నేను కైవస మయితినో