పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-2 సామంతం సంపుటం: 11-566

పల్లవి: విన్నప మొక్కటే నీకు వేవేలకు
         మన్నించక నీకుఁ బోదు మామనసు నీది

చ. 1: చేరి మొక్కే వారమూ సేవ సేసేవారమూ
       యేరితి మాట లాడినా నే మాయ నీకు
       నేరనివారు దిట్టితే నీకఁ బోదు బుద్ది చెప్ప
       భారము నీదే సు మ్మయ్య పడఁతినే నీకు

చ. 2: నీతోడివారమా నీసరివారమా నేము
        యీతల నేఁ గైకొన్న నే మాయ నీకు
        కాతరాన నే రా కున్నఁ గదియక నీకుఁ బోదు
        నాతప్పులు నీవి సుమ్మీ నాపతిని నీవూ

చ. 3: కాంతుఁడ శ్రీవెంకటేశ కాఁగిటిలోని వారమూ
       యెంత నిన్ను జంకించినా నే మాయ నీకు
       అంతరంగ మైనవారి నాదరించ కిఁకఁ బోదు
       పంతము నీది సుమ్మీ బడిదాన నేను